News November 19, 2025
VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్‌కు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్‌కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.
Similar News
News March 25, 2026
WNP: ‘గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

వనపర్తి జిల్లాలోని కళాకారులు తమ గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కళాకారులు www.tgdtculture.com వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసి, వచ్చిన దరఖాస్తును డిపిఆర్ఓ (DPRO) సంతకంతో ధ్రువీకరించుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, ఆమోదం పొందిన తర్వాత ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
News March 25, 2026
KNR: విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌లో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట శివారులో మాందాపూర్ గ్రామానికి చెందిన రైతులు కోతుల బెడద కోసం విద్యుత్తు తీగలు అమర్చగా గమనించకుండా వెళ్లిన గొర్రెల కాపరి బొల్లి సమ్మయ్య (52)తో పాటు రెండు మేకలు మృతి చెందినట్లు తెలిపారు.
News March 25, 2026
హుజురాబాద్ నియోజకవర్గం రెండు అవుతాయా..?

2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం రెండుగా చీలిపోనుందనే చర్చ జోరందుకుంది. నియోజకవర్గంలో 5 మండలాలు, 2.50 లక్షల మంది ఓటర్లున్నారు. అయితే, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటుచేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, HZB, శంకరపట్నం, సైదాపూర్, చిగురుమామిడి మండలాలతో HZB నియోజకవర్గం ఉంటుందనే చర్చ మొదలైంది.


