News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు.
Similar News
News March 13, 2026
జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎస్సై పోస్ట్.. అసలేంటీ వివాదం?

TG: విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. SI పోస్టును జోనల్ స్థాయికి కేటాయించారు. ఏ జోన్‌కైతే ఎంపికైతారో అక్కడే సర్వీస్‌తో పాటు ప్రమోషన్లు ఉంటాయి. దీంతో ఆ జోన్‌లోని ఖాళీలను బట్టి ఒకే బ్యాచ్ SIలకు త్వరగా ప్రమోషన్లు వచ్చాయి. దీంతో వివాదం మొదలైంది. దీనికి తెరదించుతూ SI పోస్టును రాష్ట్రస్థాయికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు.
News March 13, 2026
రాష్ట్రంలో 17,992 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

TG: రాష్ట్ర హోంశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 17,992 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే ఎస్సై పోస్టును జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించారు.
News March 13, 2026
రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(NCVT) కలిగిన వారు ఏప్రిల్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15ఏళ్లు పూర్తై, 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in


