News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News March 19, 2026
సౌభాతృత్వంతో పండుగలు జరుపుకోవాలి: ఎస్పీ నరసింహ

జిల్లా ప్రజలకు ఎస్పీ నరసింహ ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించవద్దని, ఒకరినొకరు గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, గొడవలకు దూరంగా ఉంటూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు
News March 19, 2026
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాట్ల పరిశీలన

నర్మెట వద్ద నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ కే. హైమావతి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. నేటి నుంచి మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానున్న నాలుగు రోజుల ‘రైతు మహోత్సవం’ వేదికను ఆమె సందర్శించారు. అధికారులతో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. హెలిప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ స్థలం, స్టాళ్ల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.
News March 19, 2026
8 మంది బాపట్ల జిల్లా పోలీసు అధికారులకు పురస్కారాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో బాపట్ల జిల్లాకు చెందిన 8 మంది పోలీసు అధికారులు ఎంపికైనట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఏడుగురికి సేవా పతాకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకం లభించనందున్నారు. చీరాల డీఎస్పీ మోయిన్, చీరాల వన్ టౌన్ ఏఎస్ఐ పల్లా సత్యనారాయణ, ఎస్బీ ఏఎస్ఐ హరిప్రసాదరావుతోపాటు పలువురు పురస్కారాలకు ఎంపికైనట్లు వివరించారు.


