News November 19, 2025

ఖమ్మం: గుర్తించుకుందాం.. ‘ఆయన’ తెర వెనుక పోరాటం

image

ఖమ్మం: సమాజంలో స్త్రీలు, వారి త్యాగాల గురించి మాట్లాడుకుంటాం. కానీ NOV19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎవరూ మాట్లాడుకోరు. వ్యక్తిగతంగా బాధయినా, ఉద్యోగంలో ఒత్తిడికి గురైనా బయటకు చెప్పుకోలేక, లోలోపల కుమిలిపోతున్నారు. కానీ నేడు జిల్లాలో పలుచోట్ల దుర్భుద్దితో భర్తలపై కొందరు భార్యలు చేస్తున్న అఘాయిత్యాలు కలవెర పెట్టిస్తున్నాయి. ఆయన ఏంచేసినా అది కుటుంబం కోసమే. వారికి అండగా ఉందాం.. శ్రమను గుర్తించుకుందాం.

Similar News

News March 22, 2026

తాగునీటి ఎద్దడి రానీయొద్దు: పద్మశ్రీ ఆదేశం

image

ఏలూరు జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి కొరత తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని ఉమ్మడి జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 557 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో ఇప్పటికే అధికశాతం నీటితో నింపినట్లు తెలిపారు. మిగిలిన మంచినీటి చెరువులను కూడా తక్షణమే పూర్తిస్థాయిలో నింపాలన్నారు.

News March 22, 2026

పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

image

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.

News March 22, 2026

ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

image

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్‌ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్‌తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.