News November 19, 2025

అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

image

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు.

Similar News

News March 19, 2026

రాయితీ పథకాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 సంవత్సరానికి మంజూరైన రాయితీ పథకాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలపై 60 నుంచి 90 శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపారు. అర్హులు ఈ నెల 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికలో మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సంబంధిత పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

News March 19, 2026

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

News March 19, 2026

బాపట్ల జిల్లాలో 7,338 LPG సిలిండర్లున్నాయి

image

జిల్లాలో LPG కొరత లేదని బాపట్ల DSO జమీర్ బాషా తెలిపారు. ప్రస్తుతం 7,338 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో 27 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని చెప్పారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయరాదని అన్నారు.