News November 19, 2025

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

image

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Similar News

News March 18, 2026

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి!

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్‌పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.

News March 18, 2026

జూన్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్?

image

AP: గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి APPSC సిద్ధమవుతోంది. జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం గ్రూప్-1లో 101 పోస్టులు, గ్రూప్-2లో 470 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆగస్టులో, గ్రూప్-2కు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

News March 18, 2026

ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: మొజ్తబా

image

అమెరికాతో సీజ్‌ఫైర్‌ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తిరస్కరించారు. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన చెప్పినట్లు ఇరాన్ అధికారి ద్వారా తెలిసిందని రాయిటర్స్ వెల్లడించింది. ‘శాంతికి ఇది సమయం కాదు. US, ఇజ్రాయెల్ మోకరిల్లి, ఓటమిని అంగీకరించి, నష్టపరిహారం చెల్లించాలి’ అని మొజ్తబా స్పష్టంచేశారని పేర్కొంది. USతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని 2 దేశాలు ఇరాన్‌కు ప్రతిపాదనలు పంపాయంది.