News November 19, 2025

జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

image

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.

Similar News

News March 5, 2026

CS.పురం PSలో మొక్క నాటిన SP

image

మార్కాపురం జిల్లా చంద్రశేఖరాపురం మండల కేంద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. బిల్డింగ్ కేసులు వివరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలు CI మాకినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర నాయక్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

News March 4, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చీమకుర్తి (M)లో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూ.2వేల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2026

మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం

image

ఒంగోలు రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలులోని ప్రజలకు తెలుసు అని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్‌తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల సమాధానం ఇచ్చారు.