News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు.
Similar News
News March 13, 2026
ఆసిఫాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.
News March 13, 2026
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు కేంద్రంగా మారిందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం 51 సంవత్సరాల మహిళకు మూత్రశయంలోని 3 గడ్డలు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలకు ఆర్థోస్కోపిక్ విధానంలో కుడి భుజానికి, ఎడమ మోకాలికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. సర్జరీలో పాల్గొన్న వైద్యబృందాన్ని అభినందించారు.
News March 13, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్ తేజస్

సూర్యాపేట జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 17,647 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ అవుతాయని తెలిపారు. సర్వర్ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని కోరారు. డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


