News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News March 29, 2026

కృష్ణా: IPL బెట్టింగ్.. 100 మందికి పైగా అరెస్ట్

image

IPL క్రికెట్ లీగ్ ప్రారంభమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట శిబిరాలు, కోడి పందేలు నిర్వహించే వారిపై దాడి చేస్తున్నారు. ఈ దాడుల్లో 100కు పైగా పందెంరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మచిలీపట్నం, అవవిగడ్డ, గుడివాడ, గన్నవరం సబ్ డివిజన్ల పరిధిలో దాడులు జరగ్గా అదుపులోకి తీసుకున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

News March 29, 2026

KNR: స్వశక్తి మహిళలకు అక్షరమాల సామర్థ్య పరీక్షలు

image

అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లాలోని స్వశక్తి మహిళలకు ఆదివారం సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీల్లోని నిరక్షరాస్యులైన మహిళల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 41,973, జగిత్యాలలో 22,363, పెద్దపల్లిలో 34,620, రాజన్న సిరిసిల్లలో 12,856 మంది అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఉల్లాస్ జిల్లా ఇన్‌ఛార్జ్ ఆంజనేయులు సందర్శించారు.

News March 29, 2026

రూ.12,000 కోట్ల ఆస్తి.. చివరికి

image

‘రేమండ్’తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన <<19504124>>విజయ్‌పత్ సింఘానియా<<>> జీవిత చరమాంకంలో అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2015లో ₹12K కోట్ల కంపెనీతోపాటు తన 37% వాటా(₹1,000 కోట్లు)ను కొడుకు గౌతమ్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో విజయ్ కోర్టుకెక్కారు. కొడుకును నమ్మి ఆస్తులు అప్పగించడం అతిపెద్ద తప్పు అని సింఘానియా గతంలో చెప్పారు.