News November 19, 2025

NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

image

నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.

Similar News

News March 9, 2026

NZB: ప్రజావాణి 103 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లతో కలిసి ఫిర్యాదుదారుల స్వీకరించారు

News March 9, 2026

NZB: జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడు: మహేశ్ కుమార్

image

జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన NZB ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు జర్నలిస్టుల ప్రధాన పాత్ర ఉందన్నారు. పత్రిక రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ విశ్వసనీయత కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్‌లకు ఉందన్నారు. జర్నలిస్ట్‌ల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు.

News March 9, 2026

NZB: ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

image

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.