News November 19, 2025

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

image

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Similar News

News March 6, 2026

సూపర్ హీరో మూవీలో సల్మాన్ ఖాన్?

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. సల్మాన్‌కు స్టోరీ నచ్చిందని, కానీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు చెప్పారని పేర్కొన్నాయి. రిటైర్ అవ్వాలనుకున్న ప్రతిసారి సమస్యలు ఎదురై యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని చెప్పాయి. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో కథ ఉండొచ్చని వివరించాయి.

News March 6, 2026

ఇక మారవా బ్రో..!

image

నిన్న టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.

News March 6, 2026

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 14దేశాలకు విస్తరించింది. ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమన్, సౌదీ, లెబనాన్, సైప్రస్ వీటిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌కు అండగా నిలుస్తున్న రష్యా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది.