News November 19, 2025
HYD: ముందే ఉంటుంది మృత్యువు.. చూసి వెళ్లండి

శీతాకాలంలో పొగమంచు పెరగడంతో రోడ్లపై ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసు అధికారులతో సమీక్షించారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్న సీపీ, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు వంటి ముందస్తు చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 19, 2026
ప్రకాశం: శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. విచారణ నిమిత్తం కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీ నియమించారు. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి వివరణ ఇవ్వాలని స్కూల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్లు రిప్లే ఇవ్వకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ అనుమతి రద్దు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.
News March 19, 2026
61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.
News March 19, 2026
మరోసారి భారీగా పడిపోయిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19423062>>బంగారం ధరలు<<>> మరోసారి భారీగా పడిపోయాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ఏకంగా రూ.7,140 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,50,280 పలుకుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.6,550 తగ్గి రూ.1,37,750కి చేరింది. ఇవాళ కేజీ వెండి రేటు రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలు పలుకుతోంది.


