News April 15, 2024
సీఎం జగన్‌కు భారీ భద్రత
AP: ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Similar News
News November 17, 2024
ఢిల్లీ మంత్రి రాజీనామా
ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.
News November 17, 2024
తొలి అరగంట మినహా ‘కంగువా’ అద్భుతం: జ్యోతిక
‘కంగువా’కు మిక్స్‌డ్ టాక్ వస్తున్న వేళ సూర్య భార్య జ్యోతిక తన అభిప్రాయాన్ని SMలో వెల్లడించారు. ‘మూవీ తొలి అర గంట నిజంగానే బాలేదు. సౌండ్ ఇబ్బందికరంగా ఉంది. అది మినహాయిస్తే ఈ సినిమా అద్భుతం. సూర్య నటన, కెమెరా వర్క్ గొప్పగా ఉంది. నెగటివ్ రివ్యూస్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. రొటీన్ స్టోరీస్, అమ్మాయిల వెంట పడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను దాటి వారి మెదడు ఎదగలేదని అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.
News November 17, 2024
‘మైసూర్ పాక్’ పేరెలా వచ్చిందో తెలుసా?
1902 నుంచి 1940 వరకు మైసూర్‌ను పాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజనప్రియుడు. కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకం రుచి చూపిద్దామని చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు కలిపి ఓ స్వీట్ చేశాడు. దాని రుచి రాజుకు నచ్చడంతో పేరేంటని అడిగారు. పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి తన రాజ్యం పేరు వచ్చేలా ‘మైసూరు పాక’ అని చెప్పాడు. తర్వాతి కాలంలో అదే ‘మైసూర్ పాక్’గా మారింది.