News November 19, 2025

రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

image

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Similar News

News March 6, 2026

ఇరాన్ సుప్రీంలీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఖమేనీ కొడుకు మొజ్తబా సుప్రీంలీడర్‌ అయ్యే అవకాశం ఉందని, దీన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తిని కోరుకుంటున్నామని తెలిపారు. ‘వాళ్లు టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఖమేనీ కొడుకు ప్రభావం చూపలేడు. వెనిజులాలో డెల్సీని ఎంపిక చేసినట్లే ఇక్కడా నేను నియామకంలో పాల్గొనాలి’ అని చెప్పారు.

News March 6, 2026

BREAKING: ఫైనల్లోకి భారత్

image

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

News March 6, 2026

బుమ్రా@500 వికెట్లు

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.