News November 19, 2025
రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Similar News
News March 23, 2026
నేడు షాహీద్ దివస్.. అమరవీరులకు జోహార్లు!

దేశ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. లాలాలజపతి రాయ్ మరణించడం భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. తన స్నేహితులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో ఆఫీసర్‌ను హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 MAR 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును షాహీద్ దివస్‌గా జరుపుకుంటాం.
News March 23, 2026
ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ నేటి నుంచి రద్దవనుంది.
News March 23, 2026
షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.


