News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 21, 2026

కాల్వ శ్రీరాంపూర్‌లో విషాదం.. కౌలు రైతు ఆత్మహత్య

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారానికి చెందిన మధునయ్య(57) మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని దొరకక ఈసారి వ్యవసాయ భూమి కౌలు తీసుకొని సాగు చేస్తున్నారు. అప్పులు పెరిగి మనస్తాపానికి గురైన మధునయ్య శనివారం ఉదయం పోలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. హుటాహుటిన పెద్దపల్లి హాస్పిటల్‌కు అతడిని తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడని భార్య స్వరూప శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 21, 2026

నక్కపల్లి: సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్

image

సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటన ఖరారు అయింది. 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో‌ ఉండవల్లి నుంచి బయలుదేరి నక్కపల్లి మండలం చందనాడలో హెలిప్యాడ్ వద్ద దిగుతారు. 3.55 గంటల నుంచి 5.28 గంటల వరకు ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 5:45 గంటలకు విజయవాడ తిరుగుపయనమవుతారు.

News March 21, 2026

రామగుండం: సింగరేణి జీడీకే-1 సీహెచ్‌పీ బొగ్గు రవాణాలో రికార్డు

image

సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-1 సీహెచ్‌పీ బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 రోజుల ముందే 1323 రేక్‌ల ద్వారా 51.92 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది. అధికారులు, కార్మికుల సమష్టి కృషితో 122% వృద్ధిరేటు సాధించడం విశేషమని ఏరియా జీఎం లలిత్ కుమార్ కొనియాడారు. రక్షణ, నాణ్యతతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.