News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.
Similar News
News April 11, 2026
కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నావా చిచ్చరపిడుగా..!

15 ఏళ్ల వయసులో మనమేం చేసుంటాం. స్నేహితులతో సరదాగా ఆడుకొని ఉంటాం. కానీ వైభవ్ సూర్యవంశీ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అసలు ఇంత చిన్న వయసులో అలాంటి విధ్వంసం ఎలా సాధ్యమని కోట్లాది మంది అవాక్కవుతున్నారు. ‘తల్లి కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకొని ఉంటాడు’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాలుగేళ్ల వయసు నుంచే వైభవ్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 14 ఏళ్లకే తొలి IPL మ్యాచ్ ఆడాడు.
News April 11, 2026
సిరిసిల్ల: ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం జిల్లా సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం శుక్రవారం అర్ధరాత్రి చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ దొంగతనాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం సవాల్‌గా తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏ ఒక్క వాహనాన్ని వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తామని జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే తెలిపారు.
News April 11, 2026
స్పేస్ మిషన్‌లో ఆ 6 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

స్పేస్ మిషన్లలో <<19621417>>రీఎంట్రీ<<>> సమయంలో వచ్చే 6 నిమిషాల ‘బ్లాక్ అవుట్’ ఒక సహజ ప్రక్రియే. వ్యోమనౌక వేగానికి గాలి ఒత్తిడికి లోనై 2,760°C వేడి పుడుతుంది. దీంతో క్యాప్సూల్ చుట్టూ ఏర్పడే ‘ప్లాస్మా’ పొర రేడియో తరంగాలను అడ్డుకోవడం వల్ల భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. దీన్నే ‘మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అంటారు. వేగం తగ్గి ప్లాస్మా చల్లబడగానే సిగ్నల్ అందుతుంది. అప్పటిదాకా గ్రౌండ్ కంట్రోల్‌లో టెన్షన్ మామూలుగా ఉండదు.


