News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News April 4, 2026

PHOTO OF THE DAY

image

బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో వరల్డ్ నంబర్-1 <<18221945>>శీతల్ దేవిని<<>> మన దేశానికే చెందిన 18 ఏళ్ల <<19294633>>పాయల్ నాగ్<<>> ఓడించారు. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో 139-136 పాయింట్ల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. పతకం ఒకరే గెలిచినా తమ ఆటతీరుతో వీరిద్దరూ ప్రజల మనసులను గెలిచారు. వీరు కలిసి దిగిన ఫొటో SMలో వైరలవుతోంది. జీవితంలో మోటివేషన్, ఇన్‌స్పిరేషన్‌కు ఈ ఆర్చరీ మహారాణులే నిదర్శనం.

News April 4, 2026

65 శాతం పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ: కలెక్టర్

image

జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సుమారు 65 శాతం పూర్తయిందని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 4, 2026

ఓటేసేముందు అభ్యర్థులెలాంటి వారో తెలుసుకోండి: EC

image

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో ఓటర్లు తెలుసుకొనేందుకు ‘KYC’ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామని EC పేర్కొంది. ‘‘ఓటర్లు ‘ECINet’ ద్వారా ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్’లో ‘KYC’ని యాక్సెస్ చేయొచ్చు. అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ గురించి తెలుసుకోవచ్చు’’ అని వివరించింది. కాగా అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో 1955 మంది పోటీలో ఉన్నట్లు తెలిపింది.