News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 4, 2026
నాయుడుపేటలో పసికందు లభ్యం

నాయుడుపేట పట్టణ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు సీడీపీఓ ఉమామహేశ్వ బుధవారం తెలిపారు. పాపకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో తాత్కాలిక సంరక్షణ, భద్రత కల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షలు.. 376 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8,529 మంది విద్యార్థులకు గాను 8,153 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 282 మంది, ఒకేషనల్ విభాగంలో 94 మంది కలిపి మొత్తం 376 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 4, 2026
83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $82.66కు చేరింది. అయితే ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తామని, అవసరమైతే హార్ముజ్ జలసంధిలో నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ హామీ ఇవ్వడంతో ధరల పెరుగుదల వేగం తగ్గింది. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 12% పెరిగింది. ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌కు ఇది ఆర్థికంగా భారం కానుంది.


