News April 15, 2024
బైజూస్ సీఈఓ రాజీనామా

ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. 6నెలల క్రితమే ఆయన ఈ పోస్టులో చేరడం గమనార్హం. సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆ బాధ్యతల్ని చూసుకోనున్నారని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోహన్ బయటి నుంచి సలహాదారుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తాము చేపట్టిన ఈ పునర్నిర్మాణం ‘బైజూస్ 3.0’కి ఆరంభమని రవీంద్రన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 25, 2026
MDK: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

ఈ ఎడాదికి HYDలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొ.పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.
News January 25, 2026
Republic day Special : దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ గాంధీజీ పిలుపు మేరకు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. సంఘసంస్కరణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించారు. 1929లో మహిళా ఉద్ధరణకు మద్రాసులో ‘ఆంధ్ర మహిళా సభ’ను స్థాపించారు. ఈ పేరుతోనే హైదరాబాదులోనూ 1958లో స్థాపించి స్త్రీ జనోద్ధరణకు సహాయకారిగా నిలిచారు.
News January 25, 2026
బంగ్లాలో మరో హిందువును చంపేశారు!

బంగ్లాదేశ్‌లో హిందువుల <<18881711>>హత్యలు<<>> ఆగడం లేదు. తాజాగా నర్సింగడి జిల్లాలో చంద్ర భౌమిక్(23)ను కాల్చి చంపారు. అతను పని చేస్తున్న గ్యారేజీలో నిద్రపోతుండగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో సజీవ దహనమయ్యాడు. ఓ వ్యక్తి దుకాణానికి నిప్పు పెట్టి పారిపోతున్న CC టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చంద్ర తండ్రి గతంలోనే చనిపోగా అనారోగ్యంతో ఉన్న తల్లి, దివ్యాంగుడైన అన్న, మరో సోదరుడి పోషణకు ఇతనే ఆధారంగా ఉన్నాడు.


