News November 19, 2025

సైలెంట్‌గా రీఛార్జ్ వ్యాలిడిటీని తగ్గించిన BSNL!

image

ఎయిర్టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా నిశ్శబ్దంగా రీఛార్జ్ ప్యాకేజీల్లో మార్పులు తీసుకొస్తోంది. BSNL తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది. గతంలో ఇదే రీఛార్జ్‌పై 35 రోజులు వ్యాలిడిటీ ఉండేది. ధరను పెంచకుండా ఇలా ప్లాన్ చేస్తోంది. ఇది 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపునకు సమానమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Similar News

News March 14, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 14)

image

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం

News March 14, 2026

IPLకు హర్షిత్ రానా దూరం?

image

ఈ నెల 28 నుంచి జరగనున్న IPL-2026కి టీమ్‌ఇండియా బౌలర్, KKR పేసర్ హర్షిత్ రానా దూరమైనట్లు నేషనల్ మీడియా పేర్కొంది. టీ20 WCకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో గాయపడిన ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గత రెండు సీజన్లలో KKR తరఫున రానా 34 వికెట్లు తీశారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా ఆకాశ్ మద్వల్, సిమర్జీత్ సింగ్‌తో పాటు మరికొంతమంది డొమెస్టిక్ బౌలర్ల పేర్లను KKR పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.