News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News March 25, 2026
రంగారెడ్డి: మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, 6 మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు.
News March 25, 2026
ఇంధన సమస్యపై నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. నేడు సభలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై చర్చించేందుకు BRS సిద్ధమైంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.
News March 25, 2026
ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ మహిళ!

విజయవాడ <<19463245>>ఉగ్రకుట్ర<<>> కేసులో హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ ద్వారా యువతను తీవ్రవాద సంస్థలవైపు మళ్లించడంలో సయిదా కీలక పాత్ర పోషించింది. ఇటీవల పట్టుబడ్డ సోహైల్ బేగ్, షరీఫ్, డ్యానిష్‌ను కూడా ఈమెనే ఉచ్చులోకి తీసుకొచ్చింది. విజయవాడకు తరలించి సయిదా బేగంను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.


