News November 19, 2025
భూపాలపల్లి: నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

భూపాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు సింగరేణి ఇల్లందు క్లబ్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు డ్రా పద్దతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయిస్తారు.
Similar News
News March 25, 2026
జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
News March 25, 2026
విజయవాడలో ‘ఉగ్ర’ అనుమానితులుగా అరెస్టయింది వీరే

వించిపేటలో సోమవారం పోలీసులు ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అరెస్టైన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్‌ల ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. వీరిలో రహమతుల్లా ర్యాపిడో డ్రైవర్‌గా, సోహైల్ బిర్యానీ షాపులో, డానిష్ ఆటోనగర్‌లో పని చేస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు.
News March 25, 2026
శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.


