News April 15, 2024
గుంటూరు: టీడీపీ ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు

పలువురు టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా, సత్తెనపల్లి-కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గుంటూరు వెస్ట్-తాడిశెట్టి మురళీమోహన్, నరసరావుపేట- నల్లపాటి రాములను కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మాచర్ల-కళ్ళం రామాంజిరెడ్డి, పంగులూరు అంజయ్యను పార్టీ కార్యదర్శులుగా నియమించారు.
Similar News
News July 7, 2025
పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.
News July 7, 2025
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News July 7, 2025
ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.