News November 19, 2025

ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

image

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Similar News

News March 21, 2026

వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదు: డీఆర్ఎం

image

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వాల్తేరు డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. విశాఖ సహా ప్రధాన స్టేషన్లలో జనరల్ కోచ్ ప్రయాణికులకు ఉచిత తాగునీరు అందించేలా ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్లలో రద్దీ నియంత్రణ, భద్రతపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల సహకారంతో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News March 21, 2026

IPL-2026కి భారత బౌలర్ దూరం!

image

IPL-2026కి KKR ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌ దీప్ గాయం కారణంగా దూరమైనట్లు CricBuzz పేర్కొంది. ఆయన టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఫ్రాంచైజీ అధికారి ఒకరు తమతో చెప్పారని వెల్లడించింది. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR ఆయన్ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేసర్ హర్షిత్ రానా దూరమవ్వగా పతిరణ ఆడటంపైనా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

News March 21, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డికి ఏఐసీసీలో కీలక పోస్ట్!

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఏఐసీసీలో కీలక పోస్ట్ ఇవ్వాలని, ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జరిపిన చర్చల్లో ఈ ప్రతిపాదనను జీవన్ రెడ్డి ముందుంచినట్లు సమాచారం. మరో మారు మీనాక్షి నటరాజన్‌తో జరిగే భేటీలో పూర్తి క్లారిటీ రానుంది. జీవన్ రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారింది.