News November 19, 2025
సత్యసాయి రూ.100 నాణెం, స్టాంపుల ఆవిష్కరణ

AP: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ రూ.100 నాణెం, 4 పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. అంతకుముందు హిల్‌వ్యూ ఆడిటోరియంలో మోదీని CM CBN సన్మానించారు. తర్వాత సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహాసమాధిని PM దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో కాసేపు ధ్యానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ ఉత్సవాల్లో పవన్, లోకేశ్, సచిన్, ఐశ్వర్యారాయ్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా

AP: రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మార్చి 21కి బదులుగా 22నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ కానుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. రెండో స్పెల్‌లో ఉండాల్సిన GFC పేపర్ల వాల్యుయేషన్‌ను కూడా 22 నుంచే నిర్వహించనున్నారు. ఈ వాయిదా ప్రభావం ఫలితాల వెల్లడిపై ఉండే అవకాశం ఉంది.
News March 20, 2026
సన్నబియ్యం పంపిణీకి రూ.7,366 కోట్లు: భట్టి

TG: రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ₹7,366CR కేటాయించినట్లు Dy CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనివల్ల 1.05 కోట్ల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే 4.50L ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ₹7,430CR ప్రతిపాదించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
News March 20, 2026
ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.


