News November 19, 2025
కాజీపేట నుంచి దర్భంగాకు నేడు స్పెషల్ ట్రైన్

కాజీపేట మీదుగా దర్భంగా స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి- దర్భంగా మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
News March 11, 2026
‘కరోనా’కు ఆరేళ్లు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?
News March 11, 2026
నెల్లూరు: నారా లోకేశ్ పర్యటనలో మార్పులు

మంత్రి నారా లోకేశ్ ఈనెల 12న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు జువ్వలదిన్నె వద్ద జరిగే సాగర్ డిఫెన్స్ ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్‌లో పాల్గొంటారు.


