News November 19, 2025
వరంగల్: ‘ఆయన’ పెదవిపై చిరునవ్వు చెరగనివ్వడు!

ఆయన కష్టం ఎవరికీ కనిపించదు. సంతోషాన్ని పంచుకుంటాడు. బాధను దిగమింగుకుంటాడు. పెదవిపై చిరునవ్వు చెరగనివ్వకుండా సమాజంతో పోటీ పడతాడు. చెమట చిందిస్తూ, శ్రమనే నమ్ముకొని నిత్యం కుటుంబం గురించే ఆలోచిస్తాడు. నిజానికి ఆయన రెక్కాడితేనే కుటుంబం నిలబడుతుంది. అలాంటి భర్తలకు తోడుగా ఉండాల్సింది పోయి ఉమ్మడి వరంగల్‌లోని కొందరు భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఆయనకు అండగా ఉందాం. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సం.SHARE
Similar News
News April 3, 2026
నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.
News April 3, 2026
నల్గొండ: ‘టీబీ ముక్త్ భారత్’లో 3 గ్రామాలు

క్షయ వ్యాధి నిర్మూలనలో శాలిగౌరారం మండలం విశేష ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలిచింది. కేంద్రం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిరుమలరాయినిగూడెం, తుడిమిడి, ఉప్పలంచ టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఈ గ్రామాలను ఎంపిక చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సూర్య శిల్ప తెలిపారు. ఈ గుర్తింపు పట్ల గ్రామస్థులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 3, 2026
ఎనుమాముల మార్కెట్లో రూ.3కోట్లతో పారిపోయిన వ్యాపారి!

వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఓ మిర్చి వ్యాపారి రూ.3కోట్లతో పారిపోయినట్లు తెలిసింది. మొగుళ్లపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సదరు వ్యాపారి.. నగరంలోని దేశాయిపేటలోని లక్ష్మీ టౌన్ షిప్‌లో కిరాయికి ఉంటున్నాడు. మార్కెట్లో గత మార్చి నెలలో సుమారు రూ.2.5కోట్ల మిర్చి ఖరీదు చేసిన సదరు వ్యాపారి గత సోమవారం నుంచి కనిపించట్లేదని సమాచారం. అతడిని నమ్మి సరుకు ఇచ్చిన అర్తి దారులు ఆందోళన చెందుతున్నారు.


