News November 19, 2025

జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

image

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.

Similar News

News March 20, 2026

రేపు మార్కాపురంలో జాబ్ మేళా

image

మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫోటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News March 20, 2026

ప్రకాశం: కారు ధ్వంసం.. చంపుతామని బెదిరింపులు

image

ఒంగోలుకు చెందిన పవన్ కుమార్‌ కారును గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చిన్నగంజాం మండలంలోని కడవకుదురు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. సొపిరాలకి చెందిన కోటేశ్వరరావు, సన్నీ, వాసు మరికొంతమంది కలిసి పవన్ కుమార్ కారును ధ్వంసం చేశారు. అనంతరం చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు SI చెప్పారు.

News March 20, 2026

ప్రకాశం: అనారోగ్యంతో పోలీస్ జాగిలం మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9 ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో SP హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.