News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News April 3, 2026
పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం: MLA

పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయని, భక్తులకు దర్శనం, అన్నదానం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
News April 3, 2026
13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 3, 2026
మెదక్: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.


