News November 19, 2025

మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

image

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

Similar News

News March 26, 2026

విశాఖ: ‘మాతృ మరణాలు జరగకుండా చూడాలి’

image

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 26, 2026

విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామనవమి సందర్భంగా విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు బుధవారం తెలిపారు. 26వ తేదీ సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి 27న ఉదయం భద్రాచలం చేరుకుంటాయి. శ్రీరామ నవమి రోజున భద్రాచలం దర్శనానంతరం అదేరోజు సాయంత్రం విశాఖకు తిరుగుపయనమవుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.

News March 26, 2026

28న విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు జీవీఎంసీ పిలుపు

image

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 28న నిర్వహించే ఎర్త్ అవర్‌లో విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. మార్చి 28న శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాల కోసం మన భూమిని కాపాడటంలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.