News November 19, 2025

HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

image

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Similar News

News March 14, 2026

వనపర్తిలో టెన్త్ పరీక్షలకు 7,212 మంది విద్యార్థులు

image

వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో (25 ప్రభుత్వ, 12 ప్రైవేట్) మొత్తం 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే చేరుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

News March 14, 2026

విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

image

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.

News March 14, 2026

ప.గో: మహిళపై లైంగిక వేధింపులు.. మూడేళ్ల జైలు

image

జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జులైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్పీవీఎస్ మురళీకృష్ణ.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.