News November 19, 2025
రాబోయే రోజుల్లో HYD పరిస్థితి ఏంటి?

HYD మరో ఢిల్లీ కానుందా? ఈ పరిస్థితి అవుననేలా చేస్తోంది. నగరంలో దీపావళి నాడు ఏకంగా AQI 410కిపైగా నమోదైంది. దీంతో ప్రమాదపు డేంజర్ బెల్ రెడ్ సిగ్నల్ మోగించింది. దీనిని అంచనా వేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబోయే రోజుల్లో మహానగర పొల్యూషన్ పెనుముప్పుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పీసీబీ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్‌కు నెల్లూరులో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

నెల్లూరు నగరంలోని పలు రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని రెస్టారెంట్ యజమానులు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువత మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను పెద్ద స్క్రీన్‌లో, స్నేహితులతో కేరింతలు కొడుతూ చూడాలని ఆశతో ఉన్నారు.
News March 8, 2026
పార్వతీపురం: రైలు ఢీకొని యువకుడి మృతి

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌లోని రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బ్రౌన్ కలర్ జీన్, నీలిరంగు టీ షర్ట్ ధరించాడు. 22 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందని హెచ్‌సీ రత్నకుమార్ ఆదివారం తెలిపారు. అతడి సమాచారం తెలిస్తే పార్వతీపురం జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News March 8, 2026
పాలమూరు నుంచి పార్లమెంట్ దాకా..!

తెలంగాణలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ ఆరుపదుల వయసులో కూడా జోష్‌తో సాగుతున్నారు. 1960 మే 4న నారాయణపేట్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్, రోశయ్య కేబినెట్‌ల్లో మంత్రిగా 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కొనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు. # నేడు ప్రపంచ మహిళా దినోత్సవం.


