News November 19, 2025
మార్నింగ్ ఫాగ్: నగరంలో హెల్మెట్, జాకెట్ ఇక పక్కా

శీతాకాలం తీవ్రత నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారులపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. వాహనదారులు లో-బీమ్ లైట్లు ఉపయోగించడం, సురక్షిత దూరం పాటించడం, ఓవర్‌టేక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైకర్లు హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు.
Similar News
News March 12, 2026
భద్రాద్రి: విద్యార్థులు.. మన పంట.. మన భోజనం

అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయల తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండించిన తాజా కూరగాయలనే హాస్టల్ మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో శ్రమ విలువను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రిన్సిపల్ బి.రవి తెలిపారు. విద్యార్థుల ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.
News March 12, 2026
ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).
News March 12, 2026
విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.


