News November 19, 2025

రాబోయే రోజుల్లో HYD పరిస్థితి ఏంటి?

image

HYD మరో ఢిల్లీ కానుందా? ఈ పరిస్థితి అవుననేలా చేస్తోంది. నగరంలో దీపావళి నాడు ఏకంగా AQI 410కిపైగా నమోదైంది. దీంతో ప్రమాదపు డేంజర్ బెల్ రెడ్ సిగ్నల్ మోగించింది. దీనిని అంచనా వేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబోయే రోజుల్లో మహానగర పొల్యూషన్ పెనుముప్పుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పీసీబీ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 11, 2026

చర్లపల్లి- కామాఖ్య మధ్య కొత్తగా అమృత్ భారత్

image

అసోంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య ఆలయాన్ని దర్శించేందుకు HYD నుంచి కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి నుంచి కామాఖ్య వరకు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ ఈనెల 13న కామాఖ్యలో ప్రారంభం కానుంది. ఈ ట్రైన్లో 8 స్లీపర్ క్లాస్, 11 సాధారణ బోగీలు ఉంటాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రిలలో ఇరు వైపులా ఆగుతుంది.

News March 11, 2026

నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది హాజరు

image

కడప జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి గణితం పరీక్ష 2,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,624 మంది పరీక్షలు రాశారు. 222 మంది ఆబ్సెంట్ అయ్యారు. హిస్టరీ పరీక్షకు 276 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 246 మంది వచ్చారు. 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

News March 11, 2026

వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

image

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.