News November 19, 2025

రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

Similar News

News March 18, 2026

బాపట్ల: ‘LPG.. వేల బుకింగ్స్ పెండింగ్’

image

బాపట్ల జిల్లాలో LPG సిలిండర్ల సరఫరాపై జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 7,516 సిలిండర్లు నిల్వలో ఉన్నాయని తెలిపారు. మంగళవారం నాటికి 5,829 సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా 52,776 బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 18, 2026

ASF: వివాహేతర సంబంధం.. గర్భిణి హత్య

image

వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణం తీసింది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన ఆత్రం <<19399280>>సమ్మక్క <<>>(25) జైహింద్‌పూర్‌కు చెందిన వివాహితుడు జలపతి మధ్య ప్రేమాయణం సాగింది. సమ్మక్క గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, భార్యాపిల్లలున్న జలపతి ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో జైహింద్‌పూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో కొట్టి, గొంతునులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News March 18, 2026

GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.