News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News March 14, 2026
త్వరలోనే BC రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

దేశంలోనే తొలిసారిగా APలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నట్లు మంత్రి ఎస్.సవిత అన్నారు. శనివారం సవిత నేతృత్వంలో జరిగిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రుల బృందం, అధికారులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.


