News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News March 24, 2026
నిర్మల్ : ‘వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి’

వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. వడదెబ్బన బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలోనే మెరుగైన చికిత్స అందించాలన్నారు.
News March 24, 2026
సిద్దిపేట: ‘క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత’

క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత అని సిద్దిపేట DMHO డాక్టర్ ధనరాజ్ అన్నారు. నాసర్ పుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిగా పాల్గొన్నారు. టీబి ముక్త్ భారత్ అభియాన్ సెకండ్ ఫేస్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 96 సమస్య ఆత్మక గ్రామాలుగా గుర్తించినట్లు చెప్పారు.
News March 24, 2026
అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.


