News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News March 21, 2026
USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News March 21, 2026
వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 21, 2026
NGKL: ప్రపంచ రికార్డు దిశగా SLBC సొరంగం

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టులో భాగంగా ఇన్‌లెట్ నిర్మాణ పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే దేవరకొండ వైపు అవుట్‌లెట్ పనులు సాగుతుండగా, రెండు వైపులా పనులను వేగవంతం చేశారు. 43.93 కి.మీ. పొడవైన ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది. భద్రతా ప్రమాణాలతో పనులు ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.


