News November 19, 2025

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

image

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.

Similar News

News March 24, 2026

దోర్నాల: సూసైడ్‌కు యత్నించిన యువకుడు.. చివరికి

image

యర్రగొండపాలెంకి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి దోర్నాల వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. SI తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ యువకుడిని గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.

News March 24, 2026

సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

image

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?

News March 24, 2026

వనపర్తి: మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ!

image

వనపర్తి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనంలోని RSETI లో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు SSC మెమో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, 3 ఫొటోలతో ఈనెల 28లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు 8522088978 నంబర్‌ను సంప్రదించవచ్చు.