News November 19, 2025

ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

image

ఏపీ మెడికల్& హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 8 కాంట్రాక్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్(మేనేజర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/

Similar News

News March 20, 2026

రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

image

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్‌బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది.

News March 20, 2026

హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

image

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.

News March 20, 2026

నేడే రాష్ట్ర బడ్జెట్

image

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.