News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News March 16, 2026
KMR: ఇంటర్ పరీక్షలకు 95.10 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


