News November 19, 2025

రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

Similar News

News March 14, 2026

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

image

ఫాస్టాగ్ వార్షిక పాసుల ధరలను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. ప్రస్తుతం రూ.3వేలు ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.3,075 వసూలు చేయనున్నట్లు తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందుగా వస్తే అది) ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు.

News March 14, 2026

భూపాలపల్లి MLA పీఏ అరెస్టు

image

భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల మండలానికి చెందిన దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కాదని, ఓ మహిళా SIని వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడని పేర్కొంది. ఈ మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 14, 2026

ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

image

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.