News November 19, 2025
స్టార్టప్‌ల కోసం ₹1000Cr ఫండ్: IT స్పెషల్ CS

TG: స్టార్టప్‌ల కోసం ₹1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
Similar News
News March 13, 2026
యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.
News March 13, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 13, 2026
BHELలో 47 పోస్టులు.. అప్లై చేశారా?

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) 47అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com


