News November 19, 2025
విష్ణు సహస్ర నామాలు ఎలా ఏర్పడ్డాయి?

భీష్ముడు అంపశయ్యపై తొలిసారిగా విష్ణు సహస్ర నామాలను స్తుతించాడు. ఇవి విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన 1000 పేర్లను సూచిస్తాయి. అయితే కృష్ణుడి సలహాతో సహదేవుడు ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేశాడు. అదే సమయంలో వ్యాసుడు వాటిని రాశాడు. ఈ నామాలను పఠించినవారికి ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెరుగుతుందని, వారిని భక్తి మార్గాన పయణించేలా చేస్తుందని నమ్మకం. ఆ నామాలు, వాటి భావాలను Way2News రోజూ మీకు అందిస్తుంది.
Similar News
News March 14, 2026
పల్నాడు: గ్యాస్ బుకింగ్‌కి అవస్థలు..!

పల్నాడు జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా, వినియోగదారులకు మాత్రం బుకింగ్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ బుకింగ్ నంబర్లకు కాల్ చేస్తే ఫోన్ కలవడం లేదని, దీంతో సిలిండర్ బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ టోల్ ఫ్రీ నంబర్ల సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News March 14, 2026
BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 తగ్గి రూ.1,59,660కు చేరింది. మూడ్రోజుల్లో రూ.3,650 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.950 పతనమై రూ.1,46,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 14, 2026
1,300 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు 6 రోజులే గడువు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19. వెబ్‌సైట్: https://www.idbi.bank.in/


