News November 19, 2025

ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..

image

చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి త్వరగా రోగాల బారిన పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని ఫ్రూట్స్ డైట్‌లో యాడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నారింజ‌, యాపిల్, దానిమ్మ‌, కివీ తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వీటితో పాటు శ‌రీరానికి త‌గినంత విట‌మిన్-డీ ల‌భించేలా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో వేడినీరు, జావలు, సూప్‌లు తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

Similar News

News March 11, 2026

నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

image

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.

News March 11, 2026

BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

image

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.

News March 11, 2026

BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

image

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.