News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

Similar News

News March 18, 2026

భారత్‌కు రెండు షిప్పుల్లో LPG.. ఒక్క రోజుకే సరిపోతుందన్న చిదంబరం!

image

శివాలిక్, నందాదేవి షిప్పుల్లో భారత్‌కు చేరుకున్న ఎల్పీజీ ఒకటిన్నర రోజులకు మాత్రమే సరిపోతుందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం ట్వీట్ చేశారు. ‘మార్చి 14-17 మధ్య శివాలిక్, నందాదేవి షిప్పులు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి భారత్‌కు చేరాయి. ఈ 2 షిప్పులు కలిసి 92,700 మెట్రిక్ టన్నుల LPG తీసుకొచ్చాయి. గూగుల్ సమాచారం ప్రకారం దేశంలో ఉన్న ప్రస్తుత డిమాండ్‌కి ఇది 1.25 లేదా 1.6 రోజులకు సరిపోతుంది’ అని పేర్కొన్నారు.

News March 18, 2026

ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

image

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

News March 18, 2026

గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

image

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.