News November 19, 2025

సంచలనం.. ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం?

image

ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఇవాళ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ Pvt Ltd ప్రింటింగ్ ప్రెస్‌లో ATS తనిఖీలు చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించింది. CCTV ఫుటేజ్‌, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ 2022లో తుర్కియేకు వెళ్లి ఫారిన్ హ్యాండ్లర్ ఉకాసాను కలిసినట్లు సమాచారం.

Similar News

News March 4, 2026

యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

image

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్‌ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.

News March 4, 2026

Stock Market: ₹9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 1367 pts నష్టపోయి 78,871 వద్ద, నిఫ్టీ 451 pts క్షీణించి 24,414 వద్ద కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం మార్కెట్ సూచీలను కిందకు లాగుతోంది. ఈ ఒక్కరోజే ట్రేడింగ్ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ₹9.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్ఫీ, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో.. టాటా స్టీల్, LT, అల్ట్రాటెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News March 4, 2026

మంచి మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

image

టాలీవుడ్ సీనియర్ నటి పావలా <<18529362>>శ్యామల<<>>, ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ఫౌండేషన్‌లో ఉంటున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించారు. వారి వైద్య & నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.10 వేలు అందేలా ఏర్పాటు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇబ్బందుల్లో ఉన్న నటికి బన్ని చేసిన సాయంపై ప్రశంసలొస్తున్నాయి.