News November 19, 2025
బొప్పాయి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని నాటిన 9వ నెల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. రైతులు బొప్పాయి రకం, వాటిని పంపే మార్గెట్ దూరాన్ని బట్టి కాయలను కోస్తూ ఉంటారు. అయితే పంటలో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వాటిని కోయాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి.. చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. కాయలను పూర్తిగా చెట్లపై పండనీయకూడదు.
Similar News
News March 10, 2026
ఇన్‌స్టాలో సంజూ హవా..

T20WCలో అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో శాంసన్‌కు 12.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఆ మ్యాచుతో పాటు సెమీఫైనల్, ఫైనల్లోనూ చెలరేగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 17.5 మిలియన్లకు చేరింది. ఫైనల్లో టీమ్ ఇండియా విజయం తర్వాత ఏకంగా 1 మిలియన్‌కు పైగా నెటిజన్లు అతడిని ఫాలో కొట్టడం విశేషం.
News March 10, 2026
చమురు సంక్షోభం.. రష్యాకు జాక్‌పాట్!

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు సంక్షోభం నెలకొందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ క్రమంలో తాము యూరప్ దేశాలకు ఆయిల్, గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘యురోపియన్ కంపెనీలు, కొనుగోలుదారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా దీర్ఘకాలిక సహకారం అందిస్తామంటే ఆయిల్ పంపడానికి మాకు అభ్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు. అటు రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలని US భావిస్తోంది.
News March 10, 2026
‘ఒక్క లీటర్ ఆయిల్ కూడా పోనివ్వం’.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

ఆయిల్ సప్లైని ఆపితే భారీ మూల్యం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే శత్రు దేశాల ఆయిల్‌ను కదలనివ్వబోమని US మిలిటరీ బేస్‌లున్న UAE, సౌదీ, ఖతర్ వంటి దేశాలను హెచ్చరించింది. ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగి ఆందోళనలో ఉన్న కంట్రీస్‌ను ఈ హెచ్చరికలు మరింత కలవరపరుస్తున్నాయి.


