News November 19, 2025
పల్నాడు: సీసీఐ నిబంధనలతో తిరస్కరణ..!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 10 రోజులు దాటినా ఒక్క కొనుగోలు కూడా జరగలేదు. తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండాలనే సీసీఐ (CCI) నిబంధనలతో బయ్యర్లు ప్రతి పంటను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర దక్కక, చేసేది లేక దళారులను ఆశ్రయించక తప్పడం లేదని వాపోతున్నారు.
Similar News
News March 18, 2026
దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.
News March 18, 2026
ఈ నెల 22న సీఎం చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించి 16 నెలల వ్యవధిలోనే ఈ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. మండలి చైర్మన్, స్పీకర్, మంత్రుల ఆధ్వర్యంలో రేపు రైతుల ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 21, 22, 23తేదీల్లో రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు.
News March 18, 2026
MNCL: సజావుగా 10వ తరగతి వార్షిక పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9,685 మందికి గాను 9,662 మంది, గతంలో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులకు ఒక్కరు హాజరయ్యారు. మొత్తం 9,688 మంది విద్యార్థులకు 9,663 హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు.


